మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నవంబర్ 9:
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా మూడుచింతల పల్లీ మండలంలోని జగన్ గూడ లో ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న కుటుంబాల వివరాల సేకరణను శనివారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి పరిశీలించారు. అదే మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలోని వరి కేంద్రాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) తనిఖీ చేశారు. అనంతరం ఎంసి పల్లి లో నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయ నూతన నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పరిశీలించారు.