మేడ్చెల్ మల్కాజిగిరి జల్లా కలెక్టర్ గౌతం పొట్రు
ప్రజా బలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నవంబర్ 9:
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్లు నిర్దేశిత ప్రొఫార్మాల నమోదులో కోడింగ్ ను అత్యంత జాగరుకతతో నింపాలని, ఎన్యుమరేటర్లు పూరించిన ప్రొఫార్మాలలో ప్రత్యేకించి కోడింగ్ ను సూపర్ వైజర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని మేడ్చెల్ మల్కాజిగిరి జల్లా కలెక్టర్ గౌతం పొట్రు అన్నారు.
శనివారం నుండి ప్రారంభమైన ఇంటింటి సమగ్ర సర్వేలో భాగంగా శామీర్ పేట్ మండలంలోని ఆలియాబాదులో ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న కుటుంబాల వివరాల సేకరణను కలెక్టరు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఏవిధంగా ప్రొఫార్మాలను నింపుతున్నారని ఎన్యుమరేటర్లు అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేటర్లు పూరించిన ప్రొఫార్మాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రొఫార్మాలలో నిర్దేశించిన చోట పుస్తకంలో ఇచ్చిన విధంగా కోడింగ్ లను నింపాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. మొదటిరోజు కాబట్టి కొంత నిదానంగా తప్పులు జరుగకుండా జాగ్రత్తగా ప్రొఫార్మాలను పూరించేలా ఎన్యుమరేటర్లకు సూచించాలని ఎంపిడిఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ మమతాబాయి, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.