మెదక్ జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి . —-జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ ,

 

మెదక్ ప్రాజబలం న్యూస్ :-

శనివారం మెదక్ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్సీ శేరి శుభష్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి వారు పాల్గొన్నారు.

ముందుగా విద్యా, మిషన్ భగీరథ, రహదారులు, భవనాల శాఖ, పంచాయితీ, గ్రామీణాభివృద్ధి, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమం, టీఎస్ ఆర్టీసీ, శిశు సంక్షేమం, పౌర సరఫరాలు, వ్యవసాయ మార్కెటింగ్, పశు సంవర్ధక, పరిశ్రమలు, గృహనిర్మాణం, మత్స్య, సహకార వంటి శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా మండలాల ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ శైలేష్ , ఆయా మండల జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking