స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు.

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం సెమీ క్రిస్మస్ సంబురాలు నిర్వహించారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మేరీ మాత పశువుల పాకలో బాల యేసుకు జన్మనివ్వడం దేవదూతలు గొర్రెల కాపర్లు ఆశీర్వాదాలు అందించడం వేగుచుక్క ప్రభువు జన్మస్థానాన్ని తెలియచెప్పే సన్నివేశాల లో పాఠశాల చిన్నారులు వేషధారణలతో అబ్బురపరిచారు. మేరీ మాత శాంతా క్లాజ్ క్రిస్మస్ ట్రీ, దేవదూతలు గొర్రెల కాపరుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ ఏసుప్రభువు జన్మదినం క్రిస్మస్ ప్రపంచానికే పెద్ద పర్వదినం అని కరుణామయని బోధనలు అందరికీ మార్గదర్శకమని తెలియజేశారు ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking