బదిలీ ఎస్సై ప్రసాద్ కి అధికారుల సన్మానం

ప్రజాబలం మంచిర్యాల ప్రతినిధి ఎప్రిల్ 03 మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ఎస్సైగా పనిచేసి ఇటీవలే బదిలీ పై వెళ్తున్న ఎస్సై ప్రసాద్ ను స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా సోమవారం సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ… లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ అధికారులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. వృత్తిలో ప్రతి ఒక్కరికి బదిలీలు తప్పవని అన్నారు,ప్రతి ఒక్కరూ నిబద్ధతతో మెలగాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking