తూప్రాన్ లో శ్రీ శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం భక్తితో స్వామి వారిని దర్శించుకొని క్రుపకు పాత్రులు కాగలరు. శలక ఆత్రేయ శర్మ.

 

శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవము గణపతి పంచాయతన, శ్రీ సత్యనారాయణ స్వామి

వీశెష పూజలు హొమలు

తూప్రాన్, ఏప్రిల్ 2 (ప్రజా బలం న్యూస్):

తూప్రాన్ పెద్ద చెఱువు కట్ట హనుమాన్ దేవాలయం వద్ద హన్మన్ జయంతి ఉత్సవాలు మంగళ వారం నుండి ఘనంగా ప్రారంభం.
తూప్రాన్ మెదక్ జిల్లా హనుమాన్ మాలాధారణ విరమణ క్షేత్రము శ్రీ మనోజపం మారుత తుల్యవేగం జతేంద్రియం బుద్ధి మతాం వరిష్టం వాతాత్మజు వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి.

హనుమాన్ మాలాధారణ గురుస్వామి వీరాంజనేయ స్వామి ఆలయ పూజారి, పురోహితులు శలక ఆత్రేయ శర్మ మాట్లాడుతూ ఇక్కడ దేవాలయం స్థల మహాత్యం గొప్పదని ఈనెల మంగళవారం నుండి ఈనెల గురువారం వరకు వీశేష పూజలు నిర్వహించబడుతాయని
భారతావనికి పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి ఉద్భవించన పావన భూమి మనది. అందువలనే అనేక పురాతన ఆలయాలు ప్రతిచోట ప్రసిద్ధమై భక్తులచేఆదరించబడుచున్నవి. మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెఱువు కట్టపై వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారు భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చే పిలిచిన పలికే దైవము. ప్రకృతి రమణీయమైన గుట్టలు, చెఱువులో నీరు, ప్రక్కకు పచ్చని పంట పొలాలు, ఈ ప్రశాంత వాతావరణంలో మనసంతా రంజింపజేస్తుంది. పక్కన బైపాస్ జాతీయ రహదారి దశాబ్దాల జీవన సమరంలో అలసి పొలసిన వారికి ఆలంబన ఇచ్చే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇచ్చటికి కుల, మత భేదములు లేకుండా ఎందరో భక్తులు స్వామిని కొలుస్తున్నారు. దుష్ట గ్రహ బాధా పీడితులు, శారీరక, మానసిక, బాధలు, సంపూర్ణ ఆరోగ్యం పొందుటకు మరియు సంతానహీనులు , మనశ్శాంతి లేనివారు, కార్య సాధకులు సంకల్ప పూర్వకంగా భక్తితో మండల దినములు ప్రదక్షిణలు జరిపి శ్రీ వీరాంజనేయ స్వామి కృపకు పాత్రులైన వారి వారి అభీష్టములు నేరవేరుచున్నవి. మరియు శని పీడ కలిగిన వారు శ్రీ వీరాంజనేయ “స్వామి, శ్రీ శనేశ్వర స్వామిని భక్తితో కొలిచి నివృత్తి జరుపుకొనుచున్నారు. అదే విధముగా సకల దేవతా గణములకు అధిపతి అయిన శ్రీ విజయగణపతి విద్యా మొదలగు కోరిన కోరికలు తీరుస్తున్నారు. కలియుగంలో మానవులు తరించుటకు శ్రీ సత్యనారాయణ స్వామి కూడా సకల ఐశ్వర్యాలు కలిగిస్తూ విద్యా వ్యాపార ల పురోభివృద్ధికై వరములు వొసగుతూ సవగ్రహాలు కూడా ప్రతిష్టింపబడినవి. శ్రీ శ్రీశ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామి వారి కరకమలములచే ప్రతిష్ఠించబడిన గణపతి పంచాయతన సత్యనారాయణ స్వామి, శనేశ్వర స్వాముల 25 వ. వార్షికోత్సవం దేవతా మూర్తులు గ్రామ వాసులకు మరియు అశేష భక్త జనులకు ఇలవేల్పు దైవములైన వారి
అనుగ్రహమునకు పాత్రులు కాగలరు. భక్తాగ్రేసులకు తెలియజేయునది మీ అందరి సహాయ సహకారములచే గత 30 నుండి హనుమత్ జయంతి ఉత్సవము జరుపబడుచున్నవి. శ్రీశ్రీశ్రీ స్వంగేరి శారదా పీఠాదీశ్వరులు జగద్గురు శంకరాచార్యులు భారతీ తీర్థమహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో… శ్రీశ్రీశ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాదీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి వారి ఆశీస్సులతో…

శ్రీశ్రీశ్రీ మధుసూదనానంద సరస్వతీ స్వామి వారి ఆశీస్సులతో మంగళవారం శోభకృత్నామన యిర చైత్ర మాస త్రయోదశి రోజున ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచన అఖండ దీపారాధన, అంకురార్పణం, సుందరకాండ, గురుచరిత్ర పారాయణములు ప్రారంభము, మన్యు పాశుపదము, తీర్థ ప్రసాద వితరణ,
ఈనెల 5 బుధవారం శోభకృత్ నామ స.ర చైత్ర శు. చతుర్దశి రోజున గణపతి, నవగ్రహ, రుద్ర, పంచసూక్త,
మన్యుసూక్త లక్ష్మీ హోమములు, భిక్ష ఇరుముడి, మంగళహారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ, అన్నదానము జరుపబడును. ఈనెల గురువారం 4 నాడు శోభభకృత్ నామ స.ర చైత్ర శు. పౌర్ణమి (హనుమాన్ జయంతి) హనుమత్ మన్యు పాశుపధము, సింధూరము, లక్ష పత్రి పూజ, లక్ష పుష్పార్చన, గణపతి పంచాయతన దేవాలయములో ఉన్న అమ్మ
వారికి ఓడిబియ్యం, కుంకుమార్చన, శ్రీశ్రీశ్రీ యతివర మాధవానంద సరస్వతి స్వామి వారి పాద పూజ, అనుగ్రహ భాషణ జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈకార్యక్రమాని విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం మచ్చ యాదగిరి, గురుస్వామి మాట్లాడుతూ
ఉ. 9 గల నుండి 11 గంటల వరకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, అన్నదానం, మాలా విరమణ జరుపబడును. అని
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు చేయించకోదలచిన భక్తులు సంప్రదించగలరు అని యాదగిరి గురు స్వామి తెలిపారు…
శనివారం త్రయోదశి, శని అమావాస్య పర్వ దినములలో ప్రత్యేకముగా తైలాభిషేకములు జరుపబడును. ఈ కార్యక్రమంలో
కార్య నిర్వాహకులు శలాక ఆత్రేయ శర్మ , యాదగిరి, గడ్డం ప్రశాంత్ కుమార్, మల్లి మల్లి ఖర్జున్ గౌడ్, యాదగిరి, శేఖర్, రాజు , నవీన్,దయనంద్ బండనాగరాజ యాదవ్,రమెశ్, లక్ష్మణ్,అజయ్ , కార్య వర్గ సభ్యులు,ఆలయ కమిటీ హన్మన్ బక్త బ్రుందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking