అనారోగ్యంతో బాధపడుతూ వృద్ధుడు ఆత్మ హత్య

 

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ అక్టోబర్ 15 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని బోయవాడకు చెందిన దూసముడి చిన్న రాజయ్య 69 అనే వృద్ధుడు అనారోగ్యంతో పంటకు కొట్టే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పై సతీష్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడన్నారు ఆపరేషన్ చేపించుకొని మందులు వాడుతున్నాడన్నారు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో తన భార్య వయస్సు పైబడి ముసలితనంలో పదే పదే చెప్పిందే చెప్పడం,చేసిన పనే చేయడంతో చాలా ఇబ్బంది పడుతూ రెండు రకాల సమస్యలు మనసులో పెట్టుకొని బాధపడుతూ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడన్నారు. మృతుని కొడుకు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking