సంచార జీవితాలను వెల్లదీస్తూ కడు దయనీయ స్థితిగతులను ఎదుర్కొంటున్న తెలంగాణ వీరబద్రియ (వీరముష్టి) సంఘం స్వర్ణోత్సవ వేడుకలను ఈనెల 21న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు వీరస్వామి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ ఆవిష్కరించారు. కులవృత్తి నశించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ కులం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన వీరబద్రియ వారికి బందు పథకాన్ని అమలు చేయాలని, బీసీ ఎంబీసీలలో మా కులానికి ప్రత్యేక గృహ పథకం ద్వారా ఇల్లు కట్టించాలని రాష్ట్రంలోని అన్ని మండలాలలో జిల్లాలలో వీరబద్రియ సంఘం భవనాల కోసం 10 గుంటల స్థలం కేటాయించి నిర్మించాలని, వీరభద్ర కులం ధ్రువీకరణ పత్రాన్ని మండల కార్యాలయాలు ద్వారా అందించాలని కోరారు. వీరబద్రియ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని బీసీ కమిషన్ చైర్మన్ ఒకలాభరణం కృష్ణమోహన్ హామీ ఇచ్చారు.