అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రమేష్ జిల్లా విద్యాశాఖ అధికారి రవిందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడలను దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 10 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వరకు దివ్యాంగులకు పరుగు పందెం, షార్ట్ పుట్, క్యారమ్, చెస్, జావెలెన్ త్రో క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. వివిధ స్థాయిలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగ అధ్యక్షులు సట్టి సాయన్న, ఇసక్ అలీ, సాక్ పెళ్లి సురేందర్, క్రాంతి కుమార్, మహేష్,దివ్యంగులు గాందరి శ్రీనివాస్, కట్కా మ్ నర్సయ్య, యాదగిరి, రమేష్ రెడ్డి, భగవాన్, పుష్ప, సముద్రాల సత్యనారాయణ, తల్ వేద గంగాధర్,దివ్యంగుల సంఘల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking