భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి డిసెంబర్ 14 (ప్రజాబలం)ఈనెల 16 వ తేదీన భద్రాద్రి కొత్తగూడం జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురం గ్రామం లో తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ రథ సారధి, తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం కీ భారీ సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోనుగొటి సంపత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కెసిఆర్ నియంత పాలన నుండి విముక్తి కలిగే లా ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి నిస్వార్థ రాజకీయం నడిపిన కోదండరాం సార్ ప్రభుత్వం లో కీలక పదవి ఇచ్చి గౌరవించాలని తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ యొక్క సన్మాన కార్యక్రమం మరియు బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమం మేధావులు ఉద్యమ నాయకులు హాజరవు తున్నారని, సన్మాన కార్యక్రమం మరియు బహిరంగ సభకు ముందుగా తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి యువతతో ర్యాలీ, గిరిజన కోయ గోండు కళాకారులతో నిత్య ప్రదర్శన నిర్వహించబోతున్నట్లు తెలిపారు. దొరల గడీల పాలన నుండి యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని విముక్తి చేయడంలో తన శక్తి వంచన లేకుండా కృషిచేసి తెలంగాణ విద్యార్థి అమరుల ఆశయ సాధన కోసం అడుగులు వేస్తున్న కోదండరాం గారికి యావత్తు తెలంగాణ ప్రజానీకం అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని కావున ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువత మలిదశ తొలిదశ ఉద్యమకారులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.