గ్రీవెన్స్ డే లో భాధితుల సమస్యల పట్ల విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

 

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి సెప్టెంబర్ 30 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎస్పీ కార్యాలయానికి వివిధ రకాల సమస్యలతో వచ్చిన భాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అట్టి సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు.ఈ రోజు ఇట్టి కార్యక్రమంలో మొత్తం 15 మంది భాదితులు ఎస్పీ గారిని స్వయంగా కలిసి తమ సమస్యలను తెలుపుకున్నారు.ఇందులో 04గురు భాధితులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తమ ఫిర్యాదుల మేరకు నమోదైన కేసులలో జాప్యం జరగకుండా విచారణ జరిపించి తమకు న్యాయం చేకూర్చాలని కోరుతూ కేసుల వివరాలను ఎస్పీ కు తెలియజేసారు ముగ్గురు భాదితులు తమ భూమికి సంభందించిన విషయంలో న్యాయం కోరుతూ ఫిర్యాదు చేశారు.ఇద్దరు భాధితులు తమ ఇండ్లలో జరిగిన దొంగతనం కేసుల విషయమై దొంగలను పట్టుకుని పోగొట్టుకున్న తమ సొత్తును తమకు అందేవిధంగా చేసి తమకు న్యాయం చేకూర్చాలని కోరారు.నలుగురు బాధితులు కుటుంబ కలహాల గురించి నమోదైన కేసుల విషయమై ఫిర్యాదు చేయడమైనది.మరో రెండు ఫిర్యాదులు తమ అసోసియేషన్స్ విషయమై కొంతమంది వ్యక్తులు అక్రమాలకు పాల్పడు తున్నారని,వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.ఇట్టి భాధితుల విషయంలో వెంటనే విచారణ చేపట్టి భాధితులకు న్యాయం చేకూర్చాలని సంభంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking