డాక్టర్స్‌ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైమ్‌ నైన్‌ న్యూస్‌ చానల్‌ వారు వైద్య రంగంలో ఉన్న ప్రముఖ మైన డాక్టర్స్‌ ను అవార్డులతో సన్మానం

ప్రజాబలం ప్రతినిధి గచ్చిబౌలి డాక్టర్స్‌ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైమ్‌ నైన్‌ న్యూస్‌ చానల్‌ వారు వైద్య రంగంలో ఉన్న ప్రముఖ మైన డాక్టర్స్‌ ను అవార్డులతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐపీఎస్‌,విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ కమిషనర్‌, ఏవి రంగనాథ్‌ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిస్వార్ధమైన డాక్టర్స్‌ సేవలను కొనియాడారు. కరోనా సమయంలో వైద్యులు చేసిన మహోన్నత సేవలను గుర్తు చేస్తూ.. డాక్టర్స్‌ డే రోజు వైద్యులకు సన్మానించడం పట్ల ప్రైమ్‌ నైన్‌ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గమన్‌ హాస్పిటల్స్‌ ఎండి డాక్టర్‌ నందకిషోర్‌ ఎర్రంశెట్టి ప్రివెన్షన్‌ మెడికల్‌ గురించి చేసిన ఉపన్యాసం అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking