జడ్పీ సర్వసభ్య సమావేశంలో
జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్.
మెదక్, జూలై 02 2024 ప్రజాబలం న్యూస్ :-
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికిఅహర్నిశలు కృషి చేశానని
జడ్పీ చైర్ పర్సన్
శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ అన్నారు.
సర్వసభ్య సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్
శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ సభ్యుల కాలపరిమితి ముగిసిన కూడా ప్రజల సమస్యలపై ప్రభుత్వ అధికారుల సమన్వయం ఎప్పటికీ అవసరం ఉంటుందని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా
విశేష కృషిచేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలపై
సానుకూలంగా స్పందించి శాఖల వారీగా ప్రణాళికలు తయారు చేసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ప్రతి శాఖకు లక్ష్యాలను నిర్దేశించి గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఇక ముందు తీసుకోవాల్సిన చర్యలు ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామన్నారు. ప్రతి శాఖల వారీగా సమావేశాలు నిర్వహించుకుంటున్నట్లు వివరించారు. పాలనయంత్రాంగం తరపున జిల్లా పరిషత్ సమావేశంలో
సభ్యులు అడిగిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులుసునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ .జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ 05 సంవత్సరాల పదవి కాలంలో ఇటు అధికారులను అటు ప్రతిపక్షాన్నిగౌరవ సభ్యులను సమన్వయం చేసుకుంటూ మచ్చలేని నాయకురాలుగా ప్రజల మన్ననలను
చూరగొన్నారని కొనియాడారు.
ఈ ఐదు సంవత్సరాల కాలంలో విజయవంతంగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఒక వేదికగా వాడుకుని గౌరవ సభ్యులు
విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని చెప్పారు
నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తో మాట్లాడి ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేశారన్నారు.
శాసనమండలి సభ్యులుసుభాష్ రెడ్డి
మాట్లాడుతూ పదవీ విరమణ అనేది
పదవికి విరమణ గాని సేవలకువిరమణ ఉండదని ప్రజల మధ్య పని చేస్తూ ఉంటేఎప్పుడో ఒకప్పుడు ప్రజలు మనకు అవకాశం కల్పిస్తారని నిరుత్సాహ పడద్దని భరోసా కల్పించారు.
గౌరవ సభ్యులుఈ 05 సంవత్సరాల కాలంలో చిత్తశుద్ధితో ప్రజలకు సేవలందించారని ఫోటో కాల్ లేకపోయినా కూడా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో
అధికారులు సహాయ సహకారాలు కావాలని వివరించారు.భవిష్యత్తులో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఉన్నత పదవులు అధిరోహించాలని
ఆకాంక్షించారు.
నారాయణఖేడ్ శాసనసభ్యులు
పి సంజీవరెడ్డి మాట్లాడుతూ పార్టీలు ఏదైనా ప్రభుత్వాలు మారిన పదవిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ పాలసీలు కూడా మారుతూ ఉంటాయి. నేను కూడా మీకు లాగే జడ్పిటిసి ఎంపీపీ పదవులు చేపట్టి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉంటే ప్రజలు శాసనసభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.మా టర్మ్ అయిపోయిందని చింతనతో ఉండకుండా కొత్త బాడీ వచ్చేవరకు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలన్నారు.
శాసనమండలి సభ్యులు యాదవ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవితంలోప్రజలలో మంచి గుర్తింపు
తెచ్చుకునిఈ ఐదు సంవత్సరాల కాలంలోగౌరవ సభ్యులుమచ్చలేని
నాయకులుగా సేవ చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు.
అంతకుముందు వైద్య ఆరోగ్య,వ్యవసాయం,
విద్యా విభాగం,పశుసంవర్ధక, విద్యుత్
తమ శాఖ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అనంతరం పదవీ విరమణ పొందిన
గౌరవ సభ్యులకు జిల్లా పరిషత్ తరపున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సభ్యులను గౌరవప్రదంగా పూలబోకేలు శాలువాలతోపూల బొకేలు శాలువాలతో ఘనంగా సత్కరించారు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్
రెవిన్యూ వెంకటేశ్వర్లు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య,మెదక్ జిల్లా ఎంపీపీల పోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ , జడ్పిటిసిలు,ఎంపీపీలు
ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.