వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత సాధించాలి

సబ్ కలెక్టర్ సభావాత్ మోతిలాల్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 29 :

వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత సాధించాలని ఆ దిశగా మహిళలు ముందుకు వెళ్లాలని మంచిర్యాల జిల్లా సబ్ కలెక్టర్ సభావాత్ మోతిలాల్ అన్నారు. బుధవారం కాసిపేట మండల కేంద్రంలోని రైతు కేంద్రంలో ఏర్పాటు చేసిన వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో అక్షర వాలంటీర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే కానిదంటే ఏమీ లేదని సంకల్ప దీక్షతో వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యతను సాధించి రాష్ట్రంలోనే నెంబర్ వన్ మండలంగా నిలపాలని ఆయన అన్నారు. కాసిపేట మండల ఐకెపి, అంగన్వాడి, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమం కొనసాగాలని ఆయన కోరారు. జిల్లా వయోజన విద్య ప్రాజెక్ట్ అధికారి అజ్మీర పురుషోత్తమ నాయక్ అధ్యక్షత వహించారు. విద్యా ఆవశ్యకతను వివరిస్తూ సాంస్కృతిక సారధి కళాకారులు పాడిన పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి ఎస్. కిషన్, సిపిఓ దొంతినేని వెంకటేశ్వరరావు, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మంచిర్యాల ఆర్డిఓ శ్రీనివాసరావు, సిడిపిఓ స్వరూప రాణి తహసిల్దార్ భోజన్న ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి క్వాలిటీ కోఆర్డినేటర్, డి.ఆర్.పి లు బి. శాంకరి, కొండు జనార్ధన్, ఎర్ర సువర్ణ, సుమన్, కో-ఆర్డినేటర్ లు , సంధ్య, ధనలక్ష్మి అంగన్వాడీ, ఐ. కె. పి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking