రాష్ట్రస్థాయి సాప్టుబాల్ అండర్ 14బాల బాలికల క్రీడోత్సవాలను ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ

 

గజ్వేల్ నియోజకవర్గం జనవరి 29 ప్రజాబలం ప్రతినిధి :-

ఒలింపియా ఇంటర్నేషనల్ స్కూల్, తూప్రాన్ క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ అండర్ 14 బాల బాలికల క్రీడోత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి.
ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీ రాధా కిషన్ హాజరయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ గంగాల సభాధ్యక్షులుగా వ్యవహరించారు. విశిష్ట అతిథిగా మండల విద్యాధికారి పర్వతి సత్యనారాయణ. జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు పేట మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అథ్లెటిక్ అసోసియేషన్ మెదక్ జిల్లా కార్యదర్శి మధుసూదన్ క్రీడోత్సవాల పరిశీలకులు గంగమోహన్ రవికుమార్
టోర్నమెంట్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ శర్మ పాల్గొని మాట్లాడారు.
టోర్నమెంట్లో ఉమ్మడి పది జిల్లాలలో హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల నుండి 300 మంది క్రీడాకారులు, 40 మంది కోచ్,మేనేజర్లు పాల్గొన్నారు.
కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఆంజనేయులు, మాధవరెడ్డి, గోవర్ధన్, చంద్రమోహన్, మాలతి, లతిఫా ఉన్నిస, పద్మ, సరోజినీ,దేవేందర్ రెడ్డి,శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking