ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని HP పెట్రోల్ పంపు వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామానికి చెందిన జెల్లపల్లి ప్రణయ్ రాజ్ అనే 27 సంవత్సరాల యువకుడు మృతి చెందగా ఎనగందుల సాయి కుమార్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి.మృతుడు ప్రణయ్ రాజ్ మరియు తన స్నేహితుడైన సాయికుమార్ ఇద్దరు పని నిమిత్తం బైక్ పై లక్షెట్టిపేట వచ్చి తిరిగి తాళ్లపేట వెళ్తుండగా రాత్రి 8 గంటల సమయంలో కొత్తూరు వైపు నుండి కరీంనగర్ చౌరస్తా వైపు వస్తున్న TS19 T2630 నెబర్ గల ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్ లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ప్రణయ్ రాజ్ చనిపోయాడని చెప్పారు.గాయపడ్డ సాయి కుమార్ మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదు.మృతునికి ఇంకా పెళ్లి కాలేదు పిర్యాదురాలు జెల్లపల్లి ఆల్బన(మృతుడి తల్లి).
వై.రామయ్య.ఎ ఎస్సై వై రామయ్య,ఎస్సై పి.చంద్రకుమార్ తెలిపారు.