ఫాజుల్ నగర్ వైద్య శిబిరాన్ని సందర్శించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, నెఫ్రాలజిస్ట్.

 

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామపంచాయతీలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి శుక్రవారం గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ నెఫ్రాలజిస్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి కాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమ, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కొండలరావు ఎస్సార్ 2, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎంజ లీనా, వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారికి పలు సూచనలు చేసి వారి నుండి రక్త నమూనాల సేకరించి ల్యాబ్ కు పంపించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి లు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking