ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కెరటం బోయిన్ పల్లి సత్యవతి కి ఓయూ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సమితి జాతీయ అద్యక్షులు Dr. భద్ర గారీ అధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం సామాజిగూడా ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు.ఈ కాయక్రమంలో ప్రో కాశిం గారు, ప్రో కొండా నాగేశ్వర్ రావు గారు, పాటల పూదోట ఏపురి సోమన్న గారూ పాల్గొని ప్రసంగించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమ కారిణి, PDSU విద్యార్ధి సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి సత్యవతి గారు ఆంగ్ల సాహిత్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ను పొందడం అభినందనీయమని అన్నారు. ప్రో కాశీం మాట్లాడుతూ వెనకబడిన పాలమూరు జిల్లా నుండి ఉస్మానియా యూనివర్శిటీ వరకు వచ్చి విప్లవ విద్యార్ధి సంఘం లో పని చేయడం సమాజం కోసం పాటూ పడడం, ఆదర్శ మైన జీవితంను కొనసాగించాడం గొప్ప విషయంగా చెప్పుకోవాలన్నారు . జార్జ్ రెడ్డి జంపాలా ప్రసాద్ వారసత్వoలో నిజాయితీగా పని చేసింది సత్యా అన్నారు. ఈ దేశంలో సావిత్రీ బాయ్ పులే టీచర్ అవ్వక పోయిఉంటే మహిళకు అవకాశాలు వచ్చేవి కావు అన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆమెకి బహుమతిగా ఇచ్చారు.Dr. కొండా నాగేశ్వర్ రావు గారు మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో సత్య అత్యంత క్రియాశీలక పాత్ర పోషిందని వేలాది సదస్సుల్లో పాల్గొని విద్యార్థులను, ప్రజలను చైతన్య పరిచి వారిని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేశారనీ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్ర సాధనలో భాగము అయ్యింది అన్నారు.ఈ క్రమంలోనే సత్య అనేక కేసులు, నిర్బంధాలు ఎదురు కున్న ఎక్కడ వెనక అడుగు వేయక ముందు ఉంది అన్నారు. ఎన్ని ఉద్యమాలు చేసిన చదువును నిర్లక్ష్యం చేయకుండా డాక్టరేటు పొందడం గొప్ప విషయంగా కొనియాడారు. పాటల పూదోట ఎపూరి సోమన్న గారూ మాట్లాడుతు మంచి విలువలతో కూడిన రాజకీయాలను చేసి ప్రజలకి అతి దగ్గరగా అయిన సత్యా గౌతంలకు శుభ అభివందనం అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ నాయక్, pdsu రాష్ట్ర అధ్యక్షుడు మహేష్,బోయా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోపి, సావిత్రీ బాయ్ పులే ఫౌండేషన్ కార్యదర్శి పరమేశ్వరి, విజయ హేల్త్ ఫుడ్ ఎండీ విజయ, ఉస్మానియ యూనివర్శిటీ పరిశోధక విద్యార్ధులు తిరుపతి, విష్ణు, రమణ ఆంజనేయులు, శ్రీనివాసు, ముత్యం, రాము, ప్రశాంత్, రాజేష్ YSRTP ముషీరాబాద్ కో ఆర్డినేటర్. ఆకుల ప్రవీణ్ మరియు సత్యవతీ గారి తండ్రి రంగారావు గారు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.