పెద్ద శంకరం పేట జనవరి 10 ప్రాజబలం న్యూస్:-
పెద్ద శంకరం పేట మండల నూతన తపస్ మండల అధ్యక్షునిగా గుజ్జరి రవి (ప్రభుత్వ ఉన్నత పాఠశాల పెద్ద శంకరంపేట్), ప్రధాన కార్యదర్శిగా కొండల్( ప్రాథమిక ఉన్నత పాఠశాల జూకల్) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ ప్రకటించారు. ఈరోజు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర భాద్యులు సునార్ రమేష్ పెద్ద శంకరంపేట మండలాల్లోని పలు పాఠశాలల్లో పర్యటించి ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద శంకరంపేట లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ,పెద్ద శంకరంపేట మండల తపస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.రాష్ట్ర కమిటీ సభ్యులు సునార్ రమేష్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి గుజ్జరి రవి,కొండల్మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, సంఘ విస్తరణకు కృషి చేస్తామని తెలిపారు. తమరిని అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి గా ఎంపిక చేసినందుకు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లాదుర్గ్ మండల అధ్యక్షులు గురుచరణం తదితరులు పాల్గొన్నారు.