పేద పద్మశాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 29 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక 24వ డివిజన్ ముత్యాలమ్మ గుడి సెంటర్లో నివాసం ఉంటున్న వనం తనుష్ (10 సంవత్సరాల బాబు ) తండ్రి పేరు ఉపేందర్ గత కొంతకాలంగా మెదడు కు సంబంధించిన వ్యాధితో బాధపడు తున్నాడు అట్టి విషయాన్ని తెలుసుకున్న 24వ డివిజన్ కార్పొరేటర్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమర్తపు మురళి స్పందించి వెంటనే సంఘ సభ్యులను సంప్రదించగానే మురళి అన్న పిలుపుమేరకు సభ్యులందరూ స్పందించి రూ.60,600 లు అందజేసినారు . ఈ మొత్తాన్ని బాబు తల్లిదండ్రులకి కమర్తపు మురళి అన్న చేతుల మీదుగా అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘ ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస్ బాబు , ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పెండెం జనార్ధన్ , బండారు శ్రీనివాసరావు , ఉద్యోగ విభాగ అధ్యక్ష కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్ రావు , మొరం మధు కుమార్ , విశ్రాంత ఉద్యోగ విభాగ అధ్యక్ష కార్యదర్శులు దుస్సా సత్యనారాయణ , పిల్లలమర్రి కొండలరావు , యువజన విభాగ అధ్యక్ష కార్యదర్శులు పులిపాటి సంపత్ కుమార్ , చందా వీరభద్రం , గుడ్ల శ్రీనివాసరావు , పెంటి వెంకటేశ్వర్లు , దుర్గ నాగేశ్వరరావు , పంతంగి అశోక్ , గుర్రం కవి , మసనం సీతారామయ్యా , భీమనపల్లి శ్రీను , వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking