విద్యార్థుల భవిష్యత్తున తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని ఎస్.వి.నగర్ పురానాపూల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అప్జల్ గంజ్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మజాకుమారి అన్నారు.శనివారం నాడు పాఠశాల ప్రాంగణంలో టీచర్స్ మరియు పెరెంట్స్ సమావేశం జరిగింది.విద్యార్థులకు క్రమశిక్షణ పాఠశాల విద్య అభ్యసించేటప్పుడు అలవడాలని అన్నారు పదవతరగతి పరీక్షలు జరిగే వరకు టీ.వి లకు, సినిమాలకు దూరంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల తెలుగు పండితులు డాక్టర్ ఎస్.విజయభాస్కర్, ఉపాధ్యాయులు బల్వంత్ రెడ్డి, అశోక్ బాబు, సుచరిత,బబిత, కౌసర్ ఫాతిమా,పి.ఇ.టి.ఎన్.శ్రీనివాస్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎస్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ గురించి తెలిపారు
Prev Post