ప్రతి నెల మొదటి తేదిన జీతాలు ఇప్పించండి

ఎంఎల్సి శ్రీ నర్సిరెడ్డికి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాద్యాయుల వినతి పత్రం
హైదరాబాద్ మార్చ్ 28; ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాద్యాయ , ఉద్యోగుల జీతాలు గత 3 నెలలు రావటం లేదని ప్రతి నెల మొదటి తేదిన జీతాలు ఇప్పించాలని ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాద్యాయులు ఎంఎల్సి శ్రీ నర్సిరెడ్డిని కలిసి విన్పి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల సంఘాల పోరాట కమిటీ(USPC) ఆద్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నేడు నిర్వహించిన ధర్నా జరుగుతున్న సభకు హాజరైన ఉపాద్యాయ ఎంఎల్సి శ్రీ నర్సిరెడ్డి ని కలిసి ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాద్యాయ , ఉద్యోగుల జీతాలు గత 3 నెలలు రావటం లేదని మాకు ఇతర అన్ని రకాల సమస్యలతో సతమతమవుతున్నామని పేర్కొన్నారు. మా సమస్యలకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు.ఈ ధర్నా కార్యక్రమం లో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాద్యాయ ఉద్యోగుల నాయకులు పాల్గొన్నారని నాయకులు టి. కేశవ్ కుమార్ తెలిపారు. వీరితో పాటు ఎల్. నరేందర్, రాజేశ్వర్, సురేందర్, సాయిబాబా, శ్రీనివాస్ రావ్, రవితదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking