ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 28 : వీ ఓ ఏ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని
ఆసంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు లింగంపల్లి వెంకటేష్ డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని స్థానిక ఐబీ ఆవరణలో లక్షెట్టిపేట, దండేపల్లి,జన్నారం,హజీపూర్ మండలాల వీ ఓ ఏ ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వీఓఏ లకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం 26 వేలు రూపాయలు చెల్లించాలన్నారు.అదే విధంగా 10 లక్షల రూపాయలు ఆరోగ్య భీమా, సెర్ప్ నుంచి ఉద్యోగ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.అర్హులైన వీఓఏలను సీసీలుగా ప్రమోషన్ ఇచ్చి కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశం లో మంచిర్యాల నియోజకవర్గ వీఓఏల కమిటీ ని ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో సంఘ నాయకులు,వీఓఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.