వివిధ శుభ కార్యక్రమాలలో పాల్గొన్న పిసిసి రాష్ట్ర కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 15 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర, జిల్లా నాయకులు టి పి సి సి కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ ఇరువురు కామేపల్లి మండలంలో జరిగిన వివిధ శుభ కార్యక్రమాలు మరియు దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు వీరి రాక తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు, అభిమానులు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి చేరుకుంటున్నారు. బాసిత్ నగర్ గ్రామానికి చెందిన బానోత్ శంకర్, జ్యోతిల కుమార్తె చి ల సౌ యశ్వంతి, చి. సురేష్, లాల్య తండాకు చెందిన భూక్య బిచ్చాలు, లక్ష్మి ల కుమారుడు రాంకుమార్,శ్వేతల, కూసుమంచికు చెందిన దోతి నాగేంద్ర,ఉపేంద్రమ్మ ల కుమారుడుయాకూబ్ యాదవ్ మహేశ్వరి ల వివాహ శుభ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ముద్దులపల్లి అబ్బాస్ పురం గ్రామాలలో దశదినకర్మలలో పాల్గొని మృతుల బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గింజల నర్సిరెడ్డి, ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య, గుజ్జర్లపూడి రాంబాబు దేవండ్ల రామకృష్ణ, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు ధరావతు లాలు ధరావత్ హరిచంద్ర దొడ్డ వేణు,కాలసాని వెంకట బిక్షం, ఉపేందర్ కాట్రాల రాంబాబు, ఇమ్మడి రామనాథం సురేష్, కాట్రాల రోశయ్య బాలు వీరన్న తదితరులు పాల్గొన్నారు