ఈ నెల 17న స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం

 

ఉద్యోగుల సమస్యలపై నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా

అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యత చాటాలని పిలుపు..

టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్

మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో ఈనెల 17 శనివారం నిర్వహించనున్న స్టాండింగ్ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులకు టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన అత్యవసర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ మెదక్ జిల్లా అభివృద్ధికై జిల్లా ఉద్యోగుల, నిరుద్యోగుల మరియు విద్యార్థుల ఆకాంక్షలకనుగుణంగా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నామని, అనంతరం జిల్లా టిఎన్జీవోల డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్లు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు.

ఉద్యోగుల సమస్యలపై నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా
అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామం సమయంలో నూతన పెన్షన్, కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు మరియు ఆదాయ పన్ను పరిమితి పెంపు అంశాలపై కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగుల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మీనికి రాజ్ కుమార్, సహ అధ్యక్షులు యండి ఎగ్బాల్ బాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఫణి రాజ్, ఫజలుద్దీన్, రఘునాథరావు, సంయుక్త కార్యదర్శులు చిరంజీవచార్యులు, శివాజీ, కిరణ్ కుమార్, రాధా, ప్రచార కార్యదర్శి నర్సింలు, కార్యవర్గ సభ్యురాలు మరియ, మెదక్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు రామా గౌడ్, శ్రీకాంత్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్షులు శేషాచారి, రామాయంపేట యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్, నిఖిల్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు నగేష్, సంతోష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఫోరం అధ్యక్షులు యాదగిరి గౌడ్, ఇరిగేషన్ ఫోరం కార్యదర్శి శ్రీ హర్ష, బాధ్యులు సరస్వతి, నాంపల్లి, గాంధీ బాబు, గంగ కృష్ణ, రాజు, రేణుక , ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking