ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
సమిష్ఠిగా గంజాయిని జిల్లా నుండి తరిమికొడుదాం
సాహసోపేతంగా వెతికి గలిగాం.గంజాయి మొక్కలు ఉన్నాయని గుర్తింఛి సుమారు 70 లక్షలు రూపాయలు విలువచేసే గంజాయి మొక్కలని జప్తు చేసాము.
నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల.
నిందుతుల వివరాలు
1.టకాడ ఇందల్, నివాసం:మంగల్ సింగ్ తాండా
2. కసావత్ సజన్ లాల్, నివాసం: మంగల్ సింగ్ తాండా
3. గోతి రవీందర్, నివాసం:మంగల్ సింగ్ తాండా
4. కచ్ కద్ సంతోష్, నివాసం:మంగల్ సింగ్ తాండా
5. బామానే సురేందర్, నివాసం:మంగల్ సింగ్ తాండా
6. పేలియ ప్రతాప్ సింగ్, నివాసం:మంగల్ సింగ్ తాండా
వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తే. పదోపరకు ఆదాయం వస్తుందని, పంటతోపాటు పంట చేనులో గంజాయి మొక్కలు సాగిస్తే లక్షల లాభం గడించవచ్చునని భావించి,సులభంగా డబ్బు సంపాదించవచ్చు అనే ఉద్దేశ్యంతో ఒక అడుగు ముందుకేసి తన పొలంలో గంజాయి మొక్కల పెంపకాన్ని అంతర్పంట గా భావించి సాగు చేసి చివరికి పోలీసులకు చిక్కి కటాకటాలు పాలైనారు.
వాహనాలు కూడా వెళ్ళలేని ప్రదేశంలోకి, అరణ్యం లో రోడ్లు సరిగా లేని ప్రాంతాలలో గంజాయి సాగు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం తో జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఐ.పి.ఎస్ నేతృత్వంలో ప్రత్యేక టీంతో ఆల్లంపల్లి మరియు బాబానాయక్ తండా ప్రాంతాలలో ఎస్పి డా.జానకి షర్మిల ఐ.పి.ఎస్ కి వచ్చిన పక్క సమాచారంతో. ద్విచక్ర వాహనంపై వెళ్లి కంది మరియు పత్తి పంటలలో కంటికి కనపడకుండా అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పట్టుకోవటం జరిగింది.
పట్టుకున్న తర్వాత వాస్తవ పరిస్థితులు గమనిస్తే చాలా భయానకమైన విషయాలు తెలిశాయి.
గంజాయి సాగు చేస్తే లక్షల రూపాయలు గడించవచ్చని.అదే ఆశతో చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది.
సులభం గా డబ్బు సంపాదనతో పాటు తన అవసరాలకోసం ఏకంగా ఒక గృహపరిశ్రమ తరహాలో నిందితుడు తన పంట పొలంలో గంజాయి మొక్కల పెంపకం చేపట్టారు అని విశ్వసనీయ సమాచారంతో ఎస్పి నేతృత్వంలో ప్రత్యేక టీం వెళ్లి గంజాయి మొక్కలను గుర్తించి వాటి స్వాధీనం చేసుకోవడంతో.సినీ పత్తిలో వెళ్లిన జిల్లా ఎస్పీ.మొక్కలను సుమారు 70 లక్షలు రూపాయలు విలువచేసే గంజాయిని, నిందితులను. ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి అప్పగించడమైనది.
వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా కడెం మండలం లోని.
1.టకాడ ఇందల్, అల్లం పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న బాబానాయక్ తాండ గ్రామా శివారులోని తన యొక్క తండ్రి వ్యవసాయ భూమిలో పత్తి,కంది (తొగరు) పంటలో అంతర పంటగా ఉన్న గంజాయి మొక్కలను గుర్తించినాము. అక్కడే ఉన్న టకాడ ఇందల్ మమ్మల్ని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా,మేము అతన్ని పట్టుకొని ఈ వ్యవసాయ భూమి ఎవరిది అని అడగగా అతడు ఇట్టి వ్యవసాయ భూమి మాదే అని చెప్పగా నేను అట్టి వ్యక్తిని విచారించమని పంచులను కోరగా వారు అట్టి వ్యక్తిని విచారించగా,తన పేరు టకాడ ఇందల్ s/o హరిచంద్,వ. 35సం.లు, కులము: మథుర,వృత్తి: వ్యవసాయం, నివాసం:మంగల్ సింగ్ తండా,హెచ్/ఓ బాబనాయాక్ తండా కడం మండలం.తన నాన్న టకాడ హరిచంద్ పేరు పై బాబా నాయక్ తండా గ్రామ శివారులో సర్వే నెం.80/136 యందు 2 ఎకరాల
15 గుంటలు మరియు సర్వే నెం 80/361 యందు ౩ ఎకరాల 15 గుంటలు వ్యవసాయ భూమి కలదు.తన నాన్న వ్రుద్ద్యాప్యం వల్ల ఇంటి వద్దనే ఉంటున్నాడు.తన నాన్న పేరు మీద గల భూమిని తాను గత 4 సం.ల నుండి సాగు చేస్తున్నాడని తాను ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో అట్టి వ్యవసాయ భూమిలో పత్తి మరియు కంది(తొగరు) పంటతో పాటు అంతర పంటగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నాడని తన వ్యవసాయ భూమిలో చాలా గంజాయి మొక్కలు ఉన్నాయని అట్టి వ్యవసాయ భూమిలో ఉన్న పచ్చి గంజాయి మొక్కలు/చెట్లు
చూపించినాడు. అట్టి గంజాయి మొక్కలను పీకించి తర్వాత నేను పంచుల సమక్షంలో నెరస్తుని యొక్క నేరము ఒప్పుదల మరియు జప్తు పంచనామా నిర్వహించి అట్టి గంజాయి మొక్కలను లేక్కించగా అవి మొత్తం 83 గంజాయి మొక్కలు కలవు ఇట్టి గంజాయి మొక్కలను ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషిన్ తో తూకం వేయించగా వాటి బరువు 48.64 కిలోలు కలవు వాటి విలువ 41,50,000/-రూపాయలు కలదు.తనతో పాటు తన గ్రామస్తులైన కసావత్ సజన్ లాల్ గోతి రవీందర్,కచ్చికడ్ సoతోష్,బామానే సురేందర్,పేలియ ప్రతాప్ సింగ్ అనువారు కూడా వారి యొక్క వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్నారని మీరు నాతో వస్తే చూపిస్తానని చెప్పినాడు.
2.కసావత్ సజన్ లాల్ పత్తి మరియు కంది(తొగరి) చెనులోకి వెళ్ళి ఆ చేను లో గంజాయి మొక్కలను గుర్తించినాము ఆ చేను లో ఉన్న కసావత్ సజన్ లాల్ పారిపోయే ప్రయత్నం చేయగా, మేము అతన్ని పట్టుకొని అట్టి వ్యక్తిని విచారించగా,తన పేరు కసావత్ సజన్ లాల్.తండ్రి .మంగల్ సింగ్,వ.52 సం.లు, కులము:మథుర, వృత్తి: వ్యవసాయం, మంగల్ సింగ్ తండా, హెచ్/ఓ ఒరేయ్ కంత్రిo బాబనాయాక్ తండా,కడం మండలం,తనకు బాబా నాయక్ తండా గ్రామ శివారులో సర్వే నెం.80/196 యందు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.తాను ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తన వ్యవసాయ భూమిలో పత్తి మరియు కంది(తొగరు) పంటతో పాటు అంతర పంటగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నానని చెప్పగా అక్కడ మొక్కలను పీకించి తూకం వేయించగా వాటి బరువు400 గ్రాములు కలదు వీటి విలువ 1,00,000/-రూపాయలు కలదు.
3.గోతి రవీందర్ యొక్క పత్తి మరియు కంది(తొగరి) చెనులోకి వెళ్ళి ఆ చేనులో గంజాయి మొక్కలను గుర్తించినాము,వాటి విలువ 8 గంజాయి మొక్కలను గుర్తించాము,వాటి బరువు 2. 53 కిలోలు కలదు వీటి విలువ 4,00,000/-రూపాయలు కలదు.
4.కచ్ కద్ సంతోష్ యొక్క పత్తి మరియు కంది(తొగరి) చెనులోకి వెళ్ళి ఆ చేను లో 16 గంజాయి మొక్కలను కలవు వాటి బరువు 3.49 కిలోలు కలవు వీటి విలువ 8,00,000/- రూపాయలు కలదు.
5.బామానే సురేందర్ పొలం లో వేతకగా కంది(తొగరు) పంటతో పాటు అంతర పంటగా సాగు చేస్తున్న 16 గంజాయి మొక్కలను చూసాము,వాటి బరువు 3.29 కిలోలు కలదు వీటి విలువ 8,00,000/- రూపాయలు కలదు
6.పేలియ ప్రతాప్ సింగ్ యొక్క పత్తి మరియు కంది(తొగరి) చెనులోకి వేతకగా 20 గంజాయి మొక్కలను గుర్తించాము వాటి బరువు 4.08 కిలోలు కలవు వీటి విలువ 10,00,000/- రూపాయలు కలదు.
ఈ సందర్బంగా ఎస్పి గ్రామస్తులతో మాట్లాడుతూ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు రహస్యం గంజాయి లాంటి మత్తు పదార్థాల కోసం వచ్చిన, మీ గ్రామ పరిసర ప్రాంతాల్లో పండిస్తున్న, విక్రయిస్తున్న తక్షణమే 8712659555, 8712659599 సెల్ నంబర్ కు సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని తెలిపారు.
ప్రజలు, పోలీసులు సమిష్ఠిగా కల్సి నిర్మల్ జిల్లా నుండి గంజాయి మహమ్మారీని తరిమికొడుదామని జిల్లా ఎస్పీ ప్రజలకు పిలుపునిచ్చారు.జిల్లా పోలీస్ లో గంజాయి అక్రమ రవాణా నియంత్రణతో పాటు గంజాయి విక్రయదారులు, వినియోగదారులను ఉక్కుపాదంతో అణివేయాలనే లక్ష్యంతో నిర్మల్ పోలీసు అధికారుల పని చేస్తూ ఉంటారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో దేశ అభివృద్ది కీలకమైన యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చేందుకుగాను మత్తుపదార్థాల అక్రమరవాణాకు పాల్పడితే సహించేది లేదని అలాగే చట్ట వ్యతిరేక కార్యాలపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ క్రింది కేసులు నమోదు చేయబడుతాయని హెచ్చరించారు.
దేశ భవిష్యత్తుయిన యువతను గంజాయి మత్తుకు బానిసలుగా మారుస్తూ,వారి కుటుంబాలను సమస్యల వలయంలోకి నెట్టివేయడంతో పాటు విధ్యార్థిని విధ్యార్థులు సైతం ఈ గంజాయి ఉచ్చుకు చిక్కికొని వారి భవిష్యత్తు అంధకారం చేసుకోవడంతో పాటు, వారి తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలు గంజాయి లాంటి మత్తు పదార్థాల ద్వారా చిద్రమవుతున్నాయి. నేటి సమాజంలో ప్రమాదకారిగా మారిన గంజాయి వంటి మత్తు పదార్థాలను కట్టిడి చేయాలనే లక్ష్యంతో నిర్మల్ పోలీసులు పని చేస్తున్నారు.
8712659555, 8712659599 ఫోన్ నంబర్ ద్వారా ప్రజలు స్వచ్చందంగా ముందుగా వచ్చి గంజాయిని విక్రయిస్తున్న విక్రయదారులతో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లో గంజాయిని సేవించే వారి వివరాలు పోలీసులకు సమాచారం అందించడం ద్వారా గంజాయి విక్రయదారులు, వినియోగదారులను అణిచివేసే ధోరణి ప్రారంభమయినది.
ఈ తనిఖీల్లో పాల్గొన్న మరియు చాక చక్యంగా వ్యవహరించిన డిఎస్పీ ప్రబాకర్,ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదా రావు,కడెం ఎస్ఐ కృష్ణ సాగర్, అర్.ఎస్.ఐ రవి కుమార్,జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది సాయి, సీసీఎస్ సిబ్బంది తిరుపతి,గణేష్, సతీష్ లను,హెడ్ కానిస్తాబుల్ కైలాష్, కానిస్తాబుల్ బీమ్ రావు,షారుక్,హోమ్ గార్డ్ అదికారులు శ్రీనివాస్,వెంకటేశ్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు