సొంత భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న చర్చిపై ఎంపీడీవో కు వినతి పత్రం

 

ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ డిసెంబర్ 03 : స్వంత భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మించి దానిని చర్చిగా మార్చినందుకు,తగు చర్యల దండేపల్లి ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు మంగళవారం ఈ సందర్భంగా
మేదరి శంకర్,నివాసము లింగాపూర్(దుబ్బగూడ) అనే వారు మాట్లాడుతూ… పాఠశాల పక్కన ఉన్న నా స్వంత భూమిలో(సర్వే నెం 90/59) గ్రామానికి చెందిన సురిమిల్ల లింగయ్య తండ్రి భీమయ్య,అక్రమంగా ఇల్లు నిర్మించుకుని,(పాఠశాల సమయంలో) అందులో క్రై స్తవ ప్రార్ధనలు చేయడం, గట్టిగా అరవడం,పిల్లలు తాగునీరు కొరకు,బోరింగ్ వద్దకు వెళ్ళే పిల్లపట్ల దుర్బషలాడటం, చేస్తున్నాడు. అంతేకాకుండా పాఠశాల టీచరు ను కూడా బెదిరిస్తూ,భయాందోళనకు గురిచేస్తున్నారు.దీనిపై పలుమార్లు మేము ఫిర్యాదులు కూడా చేస్తునే ఉన్నాము.గతంలో అక్కడ ప్రార్థలను చేస్తున్నవారు, కొంతమంది హిందు గ్రామ దేవతల యొక్క విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు.దీనిపై ఫిర్యాదు చేయగా,కేసులు కూడ నమోదయ్యాయి.చర్చి న్మిణం పై ఈనెల 12న గ్రామస్తులు అభ్యంతరం తెలిపినందుకు,హిందు వర్గానికి చెందిన నంది సురేష్ అనే వ్యక్తిని క్రై స్థలు కత్తి పొడిచి హత్యాయత్నం చేశారు.దీనిపై కూడా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన దాడిచేసిన వారిపై ఎలాంటి చర్యలు లేవు.గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు కూడా లేకుండా ఇల్లు నిర్మించి,దానిని చర్చిగా మార్చి,స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నందు, అట్టి చర్చిని వెంటనే తొలగించాలని, వివాదాస్పదంగా మారిన చర్చిని 24 గంటల్లో తొలగించని యెడల హిందు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేసేందుకు సిద్ధం తెలియజేస్తున్నాము.
దీనికి గతంలో చేసిన పిర్యాదు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేదరి శంకర్,మేదరి రిమిల,మేదరి హరిష్, సంధ్యవేణి కిరణ్, గాదే శ్రీనివాస్,కొండ నరేష్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking