ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 20 : మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి వెళ్లే రహదారికి ఇరుప్రక్కల జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ,నస్పూర్ పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ తో కలిసి హాజరై మొక్కలు నాటారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని, భావితరాలకు సమతుల్య వాతావరణం అందించాలని అన్నారు.వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు,జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య,మంచిర్యాల రాజస్వ మండల అధికారి రాములు,నస్పూర్ మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్, మంచిర్యాల,నస్పూర్ మండలాల తహసిల్దార్లు రమేష్,శ్రీనివాస్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ పర్సన్ సురిమిళ్ళ వేణు,వైస్ చైర్మన్ గెల్లు రజిత,వార్డు కౌన్సిలర్లు,మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.