పత్తి పంటలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి..

 

కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు

జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్

ప్రజాబలం -మెదక్ జిల్లా నియోజకవర్గం
13.09.2024

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి పంటలను పరిశీలించిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు
జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కృషి విజ్ఞానం కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్త క్షేత్ర పర్యటన చేయడం జరిగిందని గోవింద్ తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో ప్రత్తి మరియు వరి పంట క్షేత్రాలను పరిశీలించడం జరిగింది గత వారంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వివిధ పంటల్లో చీడపీడలు ఎక్కువ స్థాయిలో సోకే అవకాశమున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మరియు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా క్షేత్ర పర్యటనలు జరిపి రైతులకు వరి మరియు ప్రత్తి పంటలు సోకేటువంటి చీడపీడల గూర్చి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత వాతావరణం చీడపీడల సోకడానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రైతులు మోతాదు మించి యూరియా వాడకం చేయవద్దని ఎక్కువ మోతాదులో యూరియా వాడకం వల్ల చీడపీడల ఉధృతి ఎక్కువ అవుతుందని సిఫార్సు మేరకే ఎరువుల వాడకం చేయాలని యూరియాతో పాటుగా పొటాష్ కూడా కలిపి వాడుకుంటే మొక్కకు రోగని శక్తి పెరుగుతుందని అన్నారు.
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుత వరి పంట లో బ్యాక్టీరియా ఎండు తెగులు సోకే అవకాశం ఉన్నందున ప్రారంభ దశలో గుర్తించినట్లయితే దీన్ని నివారించవచ్చని దీని నివారణ కోసం 19-19-19 ఎకరాకు 1000 గ్రాములు మరియు అగ్రిమైసిన్ ఎకరాకు 40 గ్రాములు కలిపి పిచికారి చేసుకోవాలని ఎక్కడైనా కాండం తొలుచు పురుగు గమనించినట్లయితే ప్రారంభ దశలో కార్టఫ్ హైడ్రో క్లోరైడ్ గుళికలను 5-8 కేజీలు, లేదా క్లోరంత్రోనిలిప్రోలు నాలుగు కేజీలు, లేదా పిప్రో నిల్ గుళికలను నాలుగు కేజీలు
చల్లుకోవాలని సూచించారు.
లేటుగా నాటు వరి పంట వేసిన క్షేత్రాలలో ఉల్లికోడు ఉధృతి ఎక్కువగా ఉంది దీన్ని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే కార్బోఫ్యురాన్ గుళికలను ఎకరాకు 10 కేజీలు వేసుకోవాలి లేదా తర్వాత దశలో గమనించినట్లయితే ప్రోఫైనోపాస్ లీటర్ నీటికి రెండు మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకుంటే కొంతవరకు దీని ఉధృతి తగ్గించవచ్చు ప్రత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించడం జరిగింది వీటి నివారణకు ప్రారంభ దశలో 1500 పి పి యం వేప నూనెను లీటర్ నీటికి ఐదు మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేసుకోవాలి, పిప్రో నిల్ రెండు మిల్లీలీటర్ లీటర్ నీటికి, ఎసిటమాప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి,ఫ్లూనికా మైడ్ 0.3 గ్రాములు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందన్నారు.
రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గించడానికి పసుపు మరియు నీలం మరియు తెలుపు రంగు జిగురాట్టలను ఎకరాకు 15 నుండి 20 వరకు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కౌడిపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి పుణ్యవతి మండల వ్యవసాయ అధికారులు స్వప్న మరియు రాజ నారాయణ మరియు రైతులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking