అంబర్‌పేట్ ప్రజాబలం ప్రతినిధి:రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. అనంతరం బర్కత్ పుర చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికలు సరిగ్గా జరగలేదని అమెరికాలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రతిష్టను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రజలు మద్దతు ఇవ్వకుండా రాహుల్ గాంధీని తిరస్కరిస్తే ఏదో కోల్పోయినట్లు రాహుల్ గాంధీ దేశం పట్ల విష ప్రచారం చేస్తున్నారని ఆనంద్ గౌడ్ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ తక్షణమే భారతీయులకు క్షమాపణ చెప్పాలని ఆనంద్ గౌడ్ స్పష్టం చేశారు. భారతదేశం పట్ల రాహుల్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, నేతలు కృష్ణ గౌడ్, వినోద్ యాదవ్, శ్యామ్ రాజ్, నంద కిషోర్,ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్, ఆనంద్ తదితరులు పాల్గోన్నారు.