చెట్లను నాటడం వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత  

 

 

ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

 

మహబూబ్ నగర్ నగరం ప్రజాబలం ప్రతినిధి చెట్లను నాటడం వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  పేర్కొన్నారు. 75 వ వన మహోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ నగరం లోని ప్రభుత్వ అందుల పాఠశాల ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు అనధికారులతో కలిసి ఆయన చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చుట్టూ వందల ఎకరాల్లో అడవి విస్తరించి ఉందన్నారు. అడవులను సంరక్షణ చేస్తేనే వర్షాలు కురిస్తాయని, భూమి సారవంతం అవుతుందన్నారు. నాలుగు ఐదు సంవత్సరాల పాటు ఈ చెట్లను మనం కాపాడితే 100 ఏండ్లు ఆ చెట్లు మన అందరిని కాపాడుతాయని ఆయన చెప్పారు. కేవలం చెట్లను నాటడమే కాదు వాటిని తప్పకుండా సంరక్షించుకోవల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన సూచించారు. అధికారులు ఉద్యోగంలో చేరిన రోజు బదిలీల సందర్భంలో మరియు రిటైర్మెంట్ సందర్భంలో మొక్కలు నాటాలన్నారు. అందుకు సంబంధించిన ఒక రిజిస్టర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ లయన్ నటరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, గంజి ఆంజనేయులు, అంజద్, జాజి మొగ్గ నర్సింహులు, ప్రశాంత్, ఖాజా పాషా, అర్షద్ అలి , డిఎఫ్ఓ సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking