సెప్టెంబర్ 06 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణం,మండలంలోని, దండెపల్లి మండలంలోని వినాయక చవితి ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ శాఖ తెలిపారు.భక్తి శ్రద్ధలతో పండగకి జరుపుకోవాలన్నారు, ఇతరులు ఎవ్వరు ఇబ్బంది పడకుండా ముందుగా జగ్రత్త పడాలని అందుకు పోలీసులకు ప్రజకు మండపం నిర్వాహక సహకరించాలన్నారు, పోలీస్ సూచనలు ప్రతి ఒక్కరు ముఖ్యంగా మండపాల నిర్వాహకులు పాటిస్తూ శాంతి భద్రతలను కాపాడే విషయంలో సహకరించాలన్నారు. మండపాల నిర్వాహకులు మండపాలను వేసే ముందు దాని ఎత్తు పొడవు వెడల్పు మరియు విగ్రహాల పూర్తి సైజ్ ముందుగానే పోలీస్ వారికి తప్పకుండా తెలియజేయాలి.మండపాల ఏర్పాటు గురించి ఏ రోజు ఎక్కడ నిమజ్జనం నిర్వహించుచున్నారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి ట్రాఫిక్ అంతరాయం కలిగే ప్రాంతాల్లో మండపాలు వేయకూడదు.హారతి, లైటింగ్ లాంప్స్,విద్యుత్ ఉపకరణాలు కారణంగా అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. విద్యుత్ ట్రాంఫార్మర్ల వద్ద మండపాలు ఏర్పాటు శ్రేయస్కరం కాదు. మండపాల వద్ద డీజెలకు అనుమతి లేదు. మైకులు స్పీకర్లు మాత్రమే పెట్టుకోవాలి,రాత్రివేళ 10 గంటలు దాటాక సౌండ్ పెట్టకూడదు,స్కూల్, కాలేజీ వద్ద అవి పని చేసే సమయంలో సౌండ్ బాక్స్ పెట్టకూడదు.మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చెలసుకోవాలి. డిజె లకు అనుమతి లేదు. కమిటీ సభ్యులు మండపాల వద్ద ప్రతిరోజు ఇద్దరైన అందుబాటులో ఉండాలి.అసాంగీక కార్యక్రమలు చేయకూడదు,మద్యం సేవించారాదు,జూదం ఆడకూడదు.ఉదయం సాయంత్రం పోలీస్ సిబ్బంది వస్తు పర్యవేక్షణ చేస్తారు,వారికి సహకరించాలి. నిమజ్జనంతో మద్యం సెవిందచకూడదు.డిజెలు పెట్టకూడదు.మండపాల వద్ద అగ్నిప్రమాదల నివారణ కోసం ఫైర్ సేఫ్టీలో భాగంగా ఇసుక బాకీట్లు, డ్రమ్ముల్లో నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి.నిమార్జనం చేసేందుకు ఉపయోగించే వాహనాల పత్రాలు అన్ని సరిగ్గా ఉండాలి.డ్రైవర్ మద్యం సేవించి ఉండకూడదు.శోభాయాత్ర మద్యలో బ్రీత్ ఎన్లైజర్ తో పోలీసులు చెక్ చేయడం జరుగుతుంది.నిమార్జనం చేసే వాహనాన్ని మాత్రమే గోదావరి,చెరువుల వద్దకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది.వేరే వాహనాలు దూరంగా పార్కింగ్ చేసుకోవాలి. మండపాల వద్ద పూజ జరిగే సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు,కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి.మండపాలను కట్టెలు,ప్లాస్టిక్ పివిసి పైపులతో మాత్రమే వేసుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లో ఇనుప పైపులు వాడకూడదని లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్,ఎస్సై పి.సతీష్ తెలిపారు.