పెండింగ్ లో ఉన్న మూడు డి ఎల్ విడుదల చేయాలి

 

పిఆర్సి అమలు చేయాలి

డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి రాజిరెడ్డి

ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 6

జూలై 2023 నాటికి పెండింగ్లో ఉన్న మూడు విడతల కరువు భత్యాన్ని విడుదల చేస్తూ పిఆర్సీ నివేదికను తెప్పించి అమలు చేయాలని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. రాజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంట ప్రధానోపాధ్యాయులుగా పని చేసిన గైని సాంబయ్య ఉద్యోగ విరమణ సమావేశానికి ముఖ్య అతిథిగా డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యా రంగం గత పది ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని ఉపాధ్యాయ నియామకాలు లేకపోవడం వల్ల చాలా పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయని ,అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బంది కొరత అన్ని పాఠశాలలో ఉందని, ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు ఇచ్చిన తర్వాత మరిన్ని ఖాళీలు ఏర్పడినవని చాలా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల నాణ్యమైన విద్య అందించడం సాధ్యం కాదని అదేవిధంగా మండల విద్యాధికారుల పోస్టులు గత రెండు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకొని మండల విద్యాధికారుల పోస్టులు కూడా పదోన్నతుల ద్వారా నింపాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇప్పటివరకు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని కనీసం జూలై 2023 నాటికి పెండింగ్ లో ఉన్న మూడు డీఏలు విడుదల చేసి పిఆర్సీ నివేదికను కూడా తొందరగా తెప్పించి జులై 2023 నుంచి ఆర్థిక లాభం వర్తించే విధంగా అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.డిటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సుధీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న జిపిఎఫ్,టిఎస్ జిఎల్ ఐసి , మెడికల్, సరెండర్ లీవు, రెగ్యులర్ వేతనాల, సెలవు వేతనాల బిల్లులను విడుదల చేయాలని కోరారు.డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి మాట్లాడుతూ అర్హత గల స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్స్ గా పదోన్నతులు ఇవ్వడానికి ఉన్న అడ్డంకులు తొలగిస్తూ జూనియర్ లెక్చరర్స్ గా పదోన్నతులు ఇవ్వాలని కోరారు.డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి మాట్లాడుతూ డిగ్రీ ,బి.ఇడి కల్గిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందేవిధంగా జీవోలు విడుదల చేసి పదివేల పిఎస్ హెచ్ ఎం పోస్టులు మంజూరు చేస్తూ పదోన్నతులు ఇవ్వాలని అలాగే ఉన్నత పాఠశాలల్లో తప్పని సరిగా ఒక కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించి డిజిటల్ బోధనా పరికరాలైన కేయాన్,ఐ.ఎఫ్ పి.బి , కంప్యూటర్ ల నిర్వహణ అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈనాటి ఉద్యోగ విరమణ అభినందన సమావేశానికి హాజరైనడిటిఎఫ్ రాష్ట్ర , జిల్లా,మండల బాధ్యులు మాట్లాడుతూ అభినందన గ్రహీత గైని సాంబయ్య జి.ప.సె.పా ఇల్లందకుంట గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉద్యోగంలో చేరిన నుండి ఉద్యోగ విరమణ వరకు వృత్తి నిబద్ధతతో పనిచేశారని వారి సేవలను గుర్తుచేసుకుంటూ సాంబయ్య ఎక్కడ పనిచేసినా విద్యార్థులతో తోటి ఉపాధ్యాయులతో అధికారులతో సృహృద్భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని అంతే గాక సంఘపరంగా డిటిఎఫ్ మండల బాధ్యులుగా పనిచేశారని, డిటిఎఫ్ సంఘకార్యకలాపాలు విజయవంతం చేయుటకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.రాజిరెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఆవాల నరహరి, తూముల తిరుపతి, జిల్లా కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ యం.సదానందం,మండల బాధ్యులు సిహెచ్.వేణు, ఎ‌స్.సంపతి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఆకుల సదానందం, పద్మ, మాలతి, రాములు,సమ్మిరెడ్డి,శ్రీధర్, రమణారెడ్డి. డీటిఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.వెంకట్రాజం, ఇల్లందకుంట మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి,పి.రాజు పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, రవి, మురళి తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking