పోలింగ్ సిబ్బంది మొదటి రాండమైజేషన్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 27:జిల్లా కలెక్టరేట్లో ఎన్ ఐ సి, వి సి హాల్ లో మంగళ వారం జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించి పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, 2425 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 13226 మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగిందని అన్నారు. అందులో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులున్నారు. ర్యాండమైజేషన్ ద్వారా నియమించిన వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking