ప్రజా ఏక్తా పార్టీ కార్వాన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వి నర్సింగ్ రావు

 

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వి నర్సింగ్ రావును ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ప్రకటించారు ఈ మేరకు గురువారం మహారాజ్ గంజ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బోనాల శ్రీనివాస్ ను నర్సింగ్ రావు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎన్నికల బరిలో కార్వాన్ నుండి తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడనని, భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోనాల శ్రీనివాస్ నర్సింగ్ రావును శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించి ఆల్ ద బెస్ట్ చెప్పారు ఈ కార్యక్రమంలో కావలి డేనియల్, వెంకటేశ్వర్లు, అంజి, గోనెసంచుల కృష్ణ, రాకేష్, రాహుల్, రాయికోడ్ కిషన్, కే నాగేష్, వి నవీన్, వాసు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking