-జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టర్
ములుగు ప్రతినిధి 12 ఫిబ్రవరి 2025:శ్రీయుత జిల్లా కలెక్టర్ ములుగు గారి ఆదేశాల మేరకు
ఈ రోజు జిల్లా పంచాయతీ అధికారి గారి ఆధ్వర్యంలో
త్వరలో నిర్వహించబోయే గ్రామపంచాయతీ ఎన్నికల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమాలకు లోబడి, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికల కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి ఒంటేరు దేవరాజ్ తెలిపారు. మంగళవారం ములుగు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల సంబంధించి మొదటి దశ లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం , పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను తయారు చేయడం మరియు రెండవ దశలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనంతరం ఉపసర్పంచ్ రాష్ట్ర ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమాలకు లోబడి నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాస్థాయి ట్రైనర్స్ తెలియజేసిన అంశాలను సంపూర్ణ అవగాహన చేసుకుని నామినేషన్ల స్వీకరణ సందర్భంలో మరియు నామినేషన్ల పరిశీలన సందర్భంలో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన సందర్భంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించడం, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం, ఎన్నికల ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక తదితర విషయాలను ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా నిర్వహించారని గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ మరియు సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎంపీడీఓ రామకృష్ణ, మల్లంపల్లి ఎంపీడీఓ రహీముద్దీన్,, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది, మాస్టర్ ట్రైనర్లు శిరుప సతీష్ కుమార్, ఎండి హమీద్, డి సూర్యనారాయణ ,ఎస్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎం శ్రీకాంత్, ఎల్ రమేష్, ఎం మధు, టి రాజేష్, ఏ రవీందర్, పాల్గొన్నారు
