మహిళలు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రండి, వేధింపుల నుండి బయటపడండి.

ఫిర్యాదు వివరాలు గోప్యంగా ఉంచబడతాయి – ఆధానపు ఎస్పి శ్రీ. ఎస్. మహెందర్ .

మెదక్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి :-

తెలంగాణ రాష్ట్రా ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా నిర్వహించిన ఆన్లైన్ కౌన్సిలింగ్ కు జిల్లా ఆధానపు ఎస్పి శ్రీ. ఎస్. మహెందర్ గారు ముఖ్య అతిదులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా అధనపు ఎస్పి శ్రీ. ఎస్.మహేందర్ మాట్లాడుతూ.. ఈ రోజు మెదక్ జిల్లా షి టీం విభాగంలో గత మూడు నెలలో మహిళలకు, బాలికలకు, వేదింపులకు గురి చేసిన కు 72 మంది ఈవ్ టీజర్స్కు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగినది అని అన్నారు . ఇందులో 13 మంది మైనర్ బాలురు మరియు 59 మంది యుక్త వయసు గల వారు ఉన్నారు. షీ టీమ్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తాయని తెలిపారు. షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ గురించి తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండి అయిన పిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ స్కానింగ్ పోస్టర్స్ ను జిల్లాలో బస్ లలో, బస్ స్టాండ్ లలో, సినిమా హల్ లు, స్కూల్స్, కళాశాలలు, ఇతర ముఖ్యమైన, రద్దీ ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని జిల్లాలో ఎవరైనా బాధిత మహిళలు షీటీమ్ కు పిర్యాదు చేయదలుచుకున్నప్పుడు ముందుగానే తమ మొబైల్ నందు QR కోడ్ స్కానర్ ను కలిగి ఉండాలని తమ ఫోన్ తో పోస్టర్ పై ఉన్న QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా https://qr.tspolice.gov.in అనే లింక్ వస్తుంది దీనిని క్లిక్ చేయగానే పిర్యాదు ఫోరం ఓపెన్ అవుతుంది. అందులోని పేరు, లొకేషన్ తదితర వివరాలను పూరించి submit చేయగానే జిల్లా పోలీస్ కార్యాలయంలో షీటీమ్ సాఫ్టువేర్ విభాగానికి చేరుతుంది. అక్కడ నిరంతరం పర్యవేక్షించే సిబ్బంది ఎప్పటి కప్పుడు ఆన్లైన్ లో వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆలొకేషన్ కు దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు ఫార్వర్డ్ చేయడం ద్వారా సంబంధిత అధికారులు లొకేషన్ కు చేరుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి వేధింపులకైన గురయ్యే మహిళలు షీటీంకు పిర్యాదు చేయదలచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అంతే కాకుండా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.

 

ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 లేదా షీటీమ్ వాట్సప్ నెంబర్ 8712657963, ఫోన్ చేసినచో మరియు ( షీ టీమ్ మెదక్ జిల్లా ఫేస్ బుక్, మెయిల్ sheteammedakdistrict@gmail.com), (ట్విట్టర్,@Msheteam) పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంటామని మరియు ఫోన్ చేసిన వారి నెంబరు పేర్లు గోప్యంగా ఉంచుతామని మహిళలు మరియు బాలికల రక్షణ గురించి షీటీమ్స్ పని చేయడం జరుగుతుందని, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వాట్సప్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని మీకు తెలియకుండా పోలీసులు సివిల్ డ్రస్ లలో ముఖ్య కూడళ్ళల్లో తిరుగుతున్నారని అలాగే చదువుకునే విద్యార్థినిలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహము చేస్తున్నట్లుగానే తెలిస్తే వెంటనే 1098 కు తెలియజేయాలని మరియు యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ యూనిట్ను మెదక్ జిల్లాలో ప్రారంభించడం జరిగిందని మనుషుల అక్రమ రవాణా జరిగితే వెంటనే సమాచారం అందించాలని ఆర్గనైజ్డ్ నేరాలు చేసే వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి గంగాధర్ మరియు బాల నర్సింలు(LCPO) షీటీమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు ప్రమీల , విజయ్, గంగామణి , స్వరూప,విజయరాణి లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking