శ్రీశ్రీశ్రీ స్వయంబు లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవముల ఆహ్వాన పత్రం విడుదల

ఛంద్రాయణగుట్ట ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్‌ రాజధాని చంద్రయాణాగుట్ట లో స్వయంంబుగా వెలసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవముల ఆహ్వాన పత్రం ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విడుదల చేశారు. బ్రహ్మోత్సవములు ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. ఆహ్వాన పత్రం లో
కార్యక్రమాల వివరములను తెలిపారు.19-02-2025, బుధవారము, మాఘ బహుళ సప్తమిఉ. 7.00 గం.లకు పంచామృత స్నపన తిరుమంజనము, అలంకారము, అష్టోత్తరం, మహా నివేదనం, తీర్థ ప్రసాద గోష్ఠి, ఉ. 10 గం. నుండి 12.00 వరకు దివ్య ప్రభంధ పారాయణము, అనంతరం అన్నదానం.సా. 5.30 గం.లకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనము, అంకురార్పణ, మృత్యుం గ్రహణం దీక్షా వస్త్ర ప్రధానం.20-02-2025, గురువారము, మాఘ బహుళ అష్టమి,ఉ. 6.00 గం.లకు పంచామృత స్నపన తిరుమంజనము, అలంకారము, అష్టోత్తరం, మహా నివేదనం. ఉ.
9.00 గం.లకు యాగశాల ప్రవేశం, హయగ్రీవహవనం, ధ్వజారోహణం, గరుడముద్ద, బలిహరణం అనంతరం అన్నదానం రా. 8.00 గం.లకు పల్లకి ఊరేగింపు.స్వామివారి అమ్మ వార్ల ఎదురుకోళ్ళ కార్యక్రమము, తీర్ధప్రసాద గోష్ఠి.
21-02-2025, శుక్రవారము, మాఘ బహుళ నవమి ఉ. 6.00 గం.లకు పంచామృత స్నపన తిరుమంజనము, అలంకారము, అష్టోత్తరం, హోమము మ. 12.00 గం.లకు ‘‘స్వామి వారి తిరుకళ్యాణోత్సము’’ ఆనంతరం అన్నదానము. రా. 8.00 గం.లకు స్వామి వారి వాహన ఊరేగింపు
22-02-2025, శనివారము, మాఘ బహుళ దశమి ఉ. 6.00 గం.లకు అభిషేకము, ఆరాధన, ఉ. 9.00 గం.లకు నృసింహ హవనము.
మహానివేదన తీర్ధప్రసాద గోష్ఠి అనంతరం అన్నదానం
23-02-2025, ఆదివారము, మాఘ బహుళ ఏకాదశి ఉ. 7.00 గం.లకు అభిషేకము, ఆరాధన, ఉ. 9.00గం.లకు సుదర్శనహవనము. మహా పూర్ణాహుతి ధ్వజ అవరోహణము, తదనంతరం ‘‘చక్రతీర్థం’’ తరువాత కుంభజల సంప్రోక్షణ, ఆశీర్వచనము, సన్మానము, తీర్ధప్రసాద గోష్ఠి.
పైన తెలిపిన కార్యక్రమములలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి, ఆ దేవుని కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ చైర్మన్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ,పాలకమండలి సభ్యులు బి . వందన ముదిరాజ్‌, ఆర్‌ . విజయలక్ష్మి , ఏ.శ్రీధర్‌, కే . శైలేష్‌.దేవాలయ అర్చకులు కంజర్ల ప్రతాపా చార్యులు, కార్యనిర్వహణ అధికారి శివ రుద్రప్ప,స్థానిక ప్రముఖులు వెంకటేష్‌, జంగరాజ్‌, గణేష్‌, రామకృష్ణ, అశోక్‌, నరేందర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking