కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ప్రణవ్

కష్టపడిన వారికి కాంగ్రెస్ లో తగిన గుర్తింపు లభిస్తుంది. కార్యకర్తల సమిష్టిగా పని చేయాలి

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్

ఇల్లందకుంట ప్రజాబలం జన్మదిన జనవరి 18

ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో కార్యకర్తలు ముఖ్య భూమిక పోషించారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీగా బిజెపి పార్టీ ఉంటుందని, ఇప్పటికే ఆ పార్టీ వాళ్లు అయోధ్య అని, రాముని అక్షింతలంటూ ప్రచారం చేస్తున్నారని. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి తగిన పదవులు ఇచ్చి కార్యకర్తను కాపాడుకుంటామని , గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బుత్ స్థాయి కమిటీ నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి కమిటీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమిష్టిగా ఉండి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించేలా ఇప్పటినుండే కార్యదీక్ష పూనుకొని ముందుకు కొనసాగాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో
ఇల్లందకుంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇంగ్లీలే రామారావు, మండల మహిళా అధ్యక్షురాలు కొడెం రజిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడేపు సారంగపాణి, జిల్లా ఫిషెర్ మేన్ బండి మల్లేష్, పెద్ది కుమార్, తో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking