ఖమ్మం ప్రతినిధి జనవరి 18 (ప్రజాబలం) ఖమ్మం పాఠశాల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.
బుదవారం కలెక్టర్ క్యాంపు ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విద్యా సంస్థలో జరిగే అభివృద్ధి పనులను అయన సమీక్షించారు టాయిలెట్ బ్లాకుల మిగులు పనులు వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. ఆర్ఎంఎస్ఏ క్రింద చేపట్టిన డైనింగ్ హాల్, తరగతి గదుల నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్మాణం పూర్తి కానందుకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. మిగులు పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమం లో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ సి.పి.ఓ. శ్రీనివాస్, డి.ఐ.ఈ.ఓ. రవిబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగశేషు, డి.ఇ, ఎ.ఇ లు తదితరులు ఉన్నారు.