రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 29 జనవరి 2025
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు అనుబంధంగా మణికొండలోని సముద్రాల వాణి రమేష్ ఆద్వర్యంలో అమావాస్య రోజున అన్న ప్రసాద వితరణ సేవకై మణికొండ క్వార్టర్స్ నందు గల పోచమ్మ దేవాలయంలో ప్రసాదం సిద్ధం కావించి అమ్మ వారికి నైవైద్యం సమర్పించిన తర్వాత విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగిన దరిమిలా కార్యక్రమమునకు స్థానిక నాయకులు కందాట రాఘవ రెడ్డి, దొడ్డి లక్ష్మణ్, శ్రీనివాస్, బోడ్డు శ్రీధర్, స్రవంతి, మోహన కృష్ణ, అందె లక్ష్మణ్ రావు, సందీప్, బాబు తదిరులతో పాటు పురజనులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం కావించినారు.