ములుగు జిల్లా ప్రజాబలం ప్రతినిధి జనవరి 29
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను శ్రీ వరుణ్ రెడ్డి గారు సిఎండి TGNPDCL గారు దర్శించుకోవడం జరిగింది మరియు మినీ మేడారం జాతరకు సంబంధించిన పనులను త్వరగా ముగించా లని మేడారం జాతరకు ఎటువంటి అంతరాయం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు మరియు సిబ్బందికి ఆదేశించడం జరిగింది. అలాగే నూతనంగా నిర్మిస్తున్న 33 కెవి లైన్ ములుగు నుండి మల్లంపల్లి వరకు పరిశీలించడం జరిగింది , వరుణ్ రెడ్డి గారు మాట్లాడుతూ మినీ జాతరకు విద్యుత్ సిబ్బంది అందరూ సన్నద్ధంగా ఉన్నారని జాతరకు ఎటువంటి అంతరాయం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ బీకాం సింగ్ గారు , ఎస్ ఈ భూపాలపల్లి మల్చూర్ నాయక్ గారు మరియు డి ఈ ములుగు నాగేశ్వరావు గారు డి ఈ ఎం ఆర్ టి సదనందం గారు మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Prev Post
Next Post