చదువుతోపాటు క్రీడలను ప్రొత్సహించాలి

స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 29:
చదువుతోపాటు క్రీడలను ప్రొత్సహించాలని, క్రీడలలో కూడా విద్యార్థులు రాణించాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం అన్నారు.
బుధవారం హకీంపేట్ లోని తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ ను జిల్లా కలెక్టరు గౌతం సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ లో రాకెట్ క్రీడలను ప్రవేశపెట్టి ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలని స్కూల్ స్పెషల్ ఆఫీసర్ కు సూచించారు. టెన్నీస్, బ్యాడ్ మెంటన్, టేబుల్ టెన్నిస్ వంటి రాకెట్ క్రీడలను తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ లో స్పెషల్ ఆఫీసర్ కు కలెక్టరు సూచించారు. స్కూలులో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, వారికి విద్యతోపాటు క్రీడలను ఏవిధంగా నేర్పిస్తూన్నారని అడిగి తెలుసుకున్నారు. స్కూలులో గల విద్యార్థుల తరగతి గదులు, క్రీడల ప్రాక్టీస్ హాలులను, గ్రౌండ్స్, డైనింగ్ హాల్, కలియ తిరిగి పరిశీలించారు. విద్యార్థులకు అందించే మెనూ చార్టును పరిశీలించి మెను ప్రకారం విద్యార్థులను భోనజం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. క్రీడల ప్రాక్టీస్ హాల్ లో పరికరాలను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసకున్నారు. ఓపెన్ గ్రౌండ్స్ లలో వీక్షకులకు సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రావు ప్రస్తుతం స్కూల్ లో 4 వతరగతి నుండి 12వ తరగతి వరకు 430 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రతి సంవత్సరం 40 మంది విద్యార్థులను అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుందని కలెక్టరుకు తెలియజేసారు. ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు క్లాసులు జరుగుతాయని, ఉదయం సాయంత్రం క్రీడల ప్రాక్టీసు ఉంటుందని తెలిపారు. మెడికల్ రూంలో మెడికల్ ఆఫీసర్, మెడిసిన్, ఫిజియోథెరపి అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లాయువజన క్రీడల అధికారి గోపాల్ రావు, స్కూల్ ప్రిన్సిపల్ ప్రకాష్, మెడికల్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking