కుంభమేళ లో జరిగిన తోకిసలాట కు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి

ఎంపీ కంటెస్టడ్ అభ్యర్థి మహ్మద్ రసూల్

ఖమ్మం ప్రతినిధి జనవరి 29 (ప్రజాబలం)
మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకుని పలువురు భక్తులు తమ నిండు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఎంపీ కంటెస్టడ్ అభ్యర్థి మహ్మద్ రసూల్ తీవ్ర దిగ్ర్భాంతి చెందారు కోట్లాది మంది హాజరయ్యే ఇటువంటి సందర్భాలలో తొక్కిసలాటలు అవాంఛనీయమైన దుర్ఘటనలు సంభవించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం తీవ్ర విచారకరమని ఒక ప్రకటనలో ఎంపీ కంటెస్టడ్ అభ్యర్థి మహ్మద్ రసూల్ పేర్కొన్నారు తొక్కిసలాటలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న వారిని వెంటనే ఆదుకోవాలని తగిన నష్టపరిహారం చెల్లించాలని గాయపడిన వాళ్లకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎంపీ రసూల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు అదేవిధంగా సంఘటన సంబంధించి నైతిక బాధ్యతవహిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం రాజీనామా చేయాలి అని కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking