మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 24:నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విచ్చేయుచున్న సందర్భంగా అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ విసి హాల్ లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డిలతో కలిసి కలెక్టరు హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఈ నెల 28న నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గౌరవ భారత రాష్ట్రపతి విచ్చేయున్న సందర్భాన్ని పురస్కరించుకొని సంబంధిత శాఖల అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో జిల్లాలోని హకీంపేట్ ఎయిర్పోర్టుకు ముందుగా చేరుకొంటారని అక్కడ అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టరు సూచించారు. నల్సార్ యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో ప్రతి విభాగానికి ఒక అధికారిని నియమిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని కీసర ఆర్డిఓను సూచించారు. రోడ్లు మరమ్మత్తులు, రెడ్ కార్పెట్లు, నిరంతరాయ విద్యుత్తు, పుష్పలంకారణ, వైద్య శిబిరాలు, అంబులెన్సు, సీటింగ్, మోబైల్ టాయిలెట్స్, పాసులు వంటి ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ సకాలంలో పనులు పూర్తి చేయాలని కలెక్టరు ఆదేశించారు. నల్సార్ యూనివర్సిటి అధికారులను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను పరిశీలిస్తూ పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టరు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అలాగే గౌరవ భారత రాష్ట్రపతి తిరిగి వెళ్ళే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు కలెక్టర్ గౌతమ్ చేశారు.
ఈ సమావేశంలో కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, అర్ అండ్ బి జిల్లా అధికారి శ్రీనివాసులు, పోలీసు, వైద్య, విద్యుత్తు, పర్యాటక శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.