మణికొండ 15వ వార్డులో స్వచ్ఛత సేవా.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 24 సెప్టెంబర్ 2024
మణికొండ మున్సిపాలిటీ 15వ వార్డు హనుమన్ నగర్ కాలనీలో స్వచ్ఛత సేవా కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బుదోళ్లు కావ్య శ్రీరాములు, కమిషనర్ ప్రదీప్ కుమార్ లు నిర్వహించి తమ సందేశంలో గృహ నివాస దారులు తడి, పొడి చెత్త వేరు వేరు చేసి వాహనంలో వెయ్యాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పినారు, ఈ కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ మాజీ వైస్ బుదోళ్లు శ్రీరాములు, హనుమాన్ నగర్ కాలనీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు బషీర్, ఏర్పుల కుమార్, శ్రవణ్ కుమార్, గంఘాదర్, ఆరిఫ్, మున్సిపాలిటీ సానిటేషన్ ఇన్స్పెకటర్స్ సంపత్, సాజిత్, సానిటేషన్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking