ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 30:తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు-2024” లో భాగంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ‘తెలంగాణ సాంస్కృతిక సారథి ‘ కళాకారుల 2 బృందాలు “ప్రజా పాలన కళాయాత్ర” శనివారం నిర్వహించినారు. ఇందులో భాగంగా మేడ్చల్ మండలం గౌడవల్లి, పూడూర్ మరియు గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిసర ప్రాంతాలలో మరియు కీసర మండలం అంకిరెడ్డిపల్లి (దమ్మాయిగూడ మున్సిపల్), కీసర, కీసర దాయర మున్సిపల్ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై పాటలతో ప్రచారం చేసినారు.