ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

 

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయందర్రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా:
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి 180, ధరఖాస్తులను జిల్లా జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, తో కలసి స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking