ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా
ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 21: ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారులు సమర్పించే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి పరిష్కారం ఇవ్వాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి , అన్నారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తో కలిసి113, అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సమస్యలను తక్షణం పరిష్కరించాలని సూచించారు. ఇప్పటివరకు శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking