గ్రీవెన్స్ డే’’ లో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.అప్పారావు
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 21 (ప్రజాబలం) ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తగు చర్య నిమిత్తం ఎండార్స్ చేశారు. మధిర మండలం మాటూరు గ్రామంకు చెందిన వేల్పుల రాహేలు తనకు కాలు విరిగి ఏమి పనిచేయలేని పరిస్థితిలో ఉన్నానని, ప్రయివేటు ఆసుపత్రలకు వెలితే శస్త్ర చికిత్స చేయాలని లక్షలు ఖర్చు అవుతుందని అన్నారు. శస్త్ర చికిత్స చేయించి ఆదుకోగలరని సమర్పించిన దరఖాస్తును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తగు చర్య నిమిత్తం సూచించారు. ఖమ్మం నగరం రమణ గుట్ట ప్రాంతంకు చెందిన పి.మంగమ్మ తాను గత 30 సంవత్సరాలుగా ఫైలేరియా (బోధకాలు) వ్యాధితో బాదపడుతున్నాని తనకు గత మూడు సంవత్సరాలుగా వచ్చే బోధకాలు వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను వచ్చేదని అట్టి పింఛను నిలుపుదల చేసినారని, పింఛను పునరుద్దరించి తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్యకై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. ఎర్రుపాలెం మండలం ఎర్రుపాలెంకు చెందిన కలకంటి వీరవసంతరావు ఎర్రుపాలెం ప్రాథమిక పాఠశాలలో ‘‘మన ఊరు మన బడి’’ కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేపట్టినారు. పాఠశాలలో నూతనంగా మరుగుదొడ్లు నిర్మించడం జరిగినది. పురాతన మరుగుదొడ్లను తొలగించలేదు వాటి వల్లన ప్రక్కనే ఉన్న నివాసముల వారికి తీవ్ర దుర్వాసనతో అనారోగ్యంకు గురవడం జరుగుతున్నదని, అట్టి మరుగుదొడ్లను తొలగింప చేయించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఇ.ఇ పంచాయితీరాజ్ అధికారికి సూచించారు. ముదిగొండ మండలం బాణాపురం గ్రామంకు చెందిన దీకొండ రామారావు తాను 2017 సంవత్సరంలో వ్యవసాయం నిమిత్తం ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో యూనియన్ బ్యాంకులో రూ.80 వేలు అప్పుగా తీసుకోవడం జరిగిందని, కుటుం వివాదం కారణంగా అట్టి లోను అసలు, వడ్డీ కలిపి మొత్తం 90 వేలు చెల్లించడం జరిగిందని అట్టి పంట రుణమాపీని తనకు వర్తింప చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం లీడ్‌బ్యాంక్ మేనేజర్‌కు సూచించారు. ఖమ్మం నగరం కొత్తగూడెం 14 వ డివిజన్‌కు చెందిన కటికర్ల ఉపేంద్ర తన భర్త మరణించడం జరిగినదని, తాను ఒంటిరి మహిళలనని, తనకు పెన్షన్ మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ది అధికారికి సూచించారు. కొణిజర్ల మండలం అనంతారం గ్రామంకు చెందిన నిడికొండ వెంకటరామయ్య తానకు షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం ఖమ్మం వారు లోన్ మంజూరు అయినదని, అట్టి లోన్ కు సంబంధించిన నగదు జమ చేయలేదని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమత్తం ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎస్సీ కార్పోఠేషన్ అధికారికి సూచించారు.
కలెక్టరేట్ కార్యాలయపు పరిపాలన అధికారి అరుణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ‘‘గ్రీవెన్స్ డే’’లో పాల్గొన్నారు.